BREAKING
ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు!

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు!

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు!

పాతపట్నం, సూర్య :  రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలు అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలకు, ప్రజాస్వామ్య విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి తీవ్రస్థాయిలో విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి డిక్లరేషన్ ఫారాలు అందించే వరకు అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమాలు యథేచ్ఛగా సాగాయని ఆరోపించారు.ప్రజల తీర్పును అధికార బలంతో తారుమారు చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను కూటమి నాయకులు ప్రలోభాలకు గురిచేశారని, కొత్త పింఛన్లు మంజూరు చేస్తామంటూ ఆశ చూపించి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులను సైతం ఓడిపోయినట్లుగా చూపించే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు.రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని రెడ్డి శాంతి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరును పక్షవాతం వచ్చిన రోగితో పోల్చారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వంద అబద్ధాలు, యాభై నీతులు చెప్పినట్లుగా ఉందని విమర్శించారు.నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు కూటమి నాయకులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా నిలబడి పోరాడారని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన పోరాటాలు రేపటి పార్టీ విజయానికి తొలిమెట్లుగా అభివర్ణించారు. గట్టి పోటీ ఇచ్చిన నాయకులకు, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీ కోసం బలంగా పోరాడిన కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ సముచిత అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క ఓటరుకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.