నీటి మడుగులో గంబూషియా చేపలు.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : అన్నిరకాల దోమల లార్వాలను తినేందుకు గంబూషియా చేపలను నీటి మడుగుల్లో వదిలామనిమెడికల్ ఆఫీసర్ దేవికృప అన్నారు . మంగళవారం వదిలి పెట్టినారు. గంబుషియా చేపలను మస్కిటో ఫిష్అని అని కూడా పిలుస్తారని మెడికల్ ఆఫీసర్ అన్నారు. దోమల నివారణలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే చిన్న రకం మంచినీటి చేపలు.వీటి జీవన విధానం మానవులకు చేకూరే ప్రయోజనాలు అధికం అన్నారు.మగ చేపలు సుమారు 1.5 అంగుళాలు, ఆడ చేపలు సుమారు 2.5 అంగుళాల పొడవు పెరుగుతాయి. బూడిద లేదా వెండిరంగులో ఉంటాయని ఆమె తెలిపారు. ప్రధానంగా ఈ చేపలకుఅత్యంత ప్రియమైన ఆహారం దోమల లార్వాలు అన్నారు. సుమారుగా 100 నుండి 150 దోమల లార్వాలను ఒక్క రోజుకు తినే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎలాంటి వాతావరణం అయినా తట్టుకునే శక్తి కలిగి ఉంటాయని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.ఆక్సిజన్ తక్కువగా ఉన్న నీరు ,మురికి నీటి కాలువల్లో నిల్వ ఉన్న గుంతలలోతోపాటు ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు ఉన్న నీటిలో కూడా ఇవి సులభంగా జీవిస్తాయని మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు.గంబూషియా చేపలను మానవాళికి జీవసంబంధిత ఆయుధాలుగా అభివర్ణించవచ్చు. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి సంఖ్యను తెచ్చుకుంటాయని అన్నారు. గంబూషియా చేపలు ఆ దోమల లార్వాలను ప్రాథమిక దశలోనే తినేయడం వల్ల దోమల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.ఫలితంగా దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా మరియు జీకా వైరస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలకుండా ఇవి మానవాళిని కాపాడతాయి.పర్యావరణ హితం దోమలను చంపడానికి మనం వాడే రసాయన మందులు పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని చేస్తాయి. కానీ, గంబూషియా చేపలను ఉపయోగించడం వల్ల ఎలాంటి కాలుష్యం లేని సహజసిద్ధమైన నివారణ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు బూదూరు బాలకృష్ణ , రాజగోపాల్ నాయుడు,.తదితరులు, పాల్గొన్నారు..