BREAKING
పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత!

రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం

Select Suryaa Now
రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం

అమరావతి/కృష్ణా జిల్లా, మేజర్ న్యూస్: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలిచేందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందించనుంది. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా డీసీసీబీ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఏపీసీఓబీ చైర్మన్ గన్నీ వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. బ్యాంకు కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.1,00,00,000 విరాళంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతు సంక్షేమమే కృష్ణా డీసీసీబీ ప్రధాన లక్ష్యమని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలవడం సహకార రంగం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం తమ ప్రాధాన్యతని తెలిపారు. కృష్ణా డీసీసీబీ సేవలను, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన బ్యాంకు చైర్మన్, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సహకార బ్యాంకింగ్ రంగంలో మరిన్ని విజయాలు సాధించి, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.