పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ
తేర్లాం, సూర్య : విజయనగరం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ బాడంగ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నీ అంగన్వాడి కార్యకర్తలకు నిర్వహించిన " పోషణ భీ - పడాయి భీ " రెండవ దశ ప్రేత్త్యేక శిక్షణా కార్యక్రమo మంగళ వారం తో ముగిసింది. బాడంగి ఐసీడీఎస్ సి.డి.పి.వో ఎల్.సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె అంగన్వాడి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల శిక్షణలో నేర్చుకున్న పోషణ ట్రాక్టర్ వినియోగం మరియు ఫ్రీ స్కూల్ అభ్యసన పద్దతులను ప్రతీ కార్య కర్త తమ అంగన్వాడి కేంద్రాల్లో తక్షణమే అమలు చేయాలన్నారు. పోషణ ట్రాక్టర్ అప్లికేషన్ స.oపూర్ణంగా వినియోగిస్తూ లబ్ధిదారులకు మెరు గైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టకోవాలన్నరు. మాస్టర్ ట్రైనర్లు గా వ్యవహరించిన అంగన్వాడి సూపర్వైజర్ లు ఈ క్రింది అంశాల పై సమగ్రంగా ఆచరణాత్మక o గా తరగతులు పూర్తి చేయాలని ఆదేశించారు. తొలిదశ వికాసం0-3 ఏళ్లు పిల్లల్లో నవచే క్యాలెండర్ ద్వారా ఉద్దీపన 3-6 ఏళ్ల పిల్లలకు మరియు ఆధార్సిల ద్వారా ఆటలబోధన మరియు స్థానికంగా దొరికే వస్తువులతో బోధనా సామాగ్రి తయారీ పిల్ల ఎదుగుదల పర్యవేక్షణ ఇన్ఫర్మేషన్ స్టూడియో మీటర్ మరియు వెయిటింగ్ స్కేల్స్ ద్వారా పిల్లల ఎత్తు బరువు కొలవడం బలహీనత తక్కువ ఎత్తు మరియు ఎంఏఎం లోపాలను గుర్తించే విధానం పోర్షన్ ట్రాక్టర్ డీజిట ల్ సేవలు గుర్తింపు వ్యవస్థ జియో టాకింగ్ హోమ్ మరియు లబ్ధిదారుల నమోదును విజిట్ షెడ్యూల్ డిజిటల్ గా పూర్తిచేసే పద్ధతిలపై ప్రత్యక్ష డెమోలు మరియు శిక్షణ దివ్యాంగ ప్రోటోకాల్ మరియు పంఖ డి పోర్టల్ ప్రాథమిక స్క్రీనింగ్ ఆర్బిఎస్కే రిఫరెన్స్ మరియు విపత్తు నిర్వహణపై ప్రత్యేక స్పష్టత రెండు రోజుల శిక్షణ జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాడంగి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిబ్బంది మరియు అంగన్వాడి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.