BREAKING
పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత!

ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు

Select Suryaa Now
ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మండల ఎంపీపీ రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.ఆత్మకూరు మండల అధ్యక్ష పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. కాగా మండలంలోని వాసిలి ఎంపిటిసి స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వుగా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా మామిడి చందన పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పారావు పాలెం ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళలకు కేటాయించగా అక్కడ కూడా ఎస్సీ మహిళ తెలుగుదేశం అభ్యర్థిగా బొమ్మ తోటి ఇందిరమ్మ పోటీ చేసి విజయం సాధించారు.కరటంపాడు ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళలకు రిజర్వు కాగా అక్కడ కూడా ఎస్సీ మహిళ దావా సుమన్య తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో పోటీ చేసి విజయం సాధించారు. వాసిలి నుండి గెలుపొందిన చందన, అప్పారావు పాలెం నుంచి గెలుపొందిన ఇందిరమ్మ, కరటంపాడు నుండి గెలుపొందిన సుమన్య లు ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ముగ్గురు ఎస్సీ మహిళలు కావడంతో ఎవరి వంతు వారు మండల అధ్యక్షుడు పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ముగ్గురిలో ఎవరిని ఆశీర్వదిస్తారా అనేది ఉత్కంఠతగా అందరూ ఎదురుచూస్తున్నారు. అప్పారావుపాలెం నుండి గెలుపొందిన ఇందిరమ్మకు అవకాశాలు ఉంటాయని ఆనం ఆశీస్సులు లభించాయని ప్రచారం జరుగుతుండగా కరటంపాడు నుండి విజయం సాధించిన దావా సుమన్యకు కూడా ఆశీస్సులు ఉన్నాయంటూ మరో ప్రచారం సాగుతోంది. కరటంపాడుకు చెందిన నాయకులు మంత్రిని మండల అధ్యక్ష పదవి తమ ఎంపిటిసి మెంబర్ కు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ముగ్గురు ఎంపీపీ పదవి రేసులో ఉండగా ఈనెల 19వ తేదీన ఎంపీపీ ఎన్నిక జరగనుంది. మరి ఎవరిని ఈ పదవి వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.