BREAKING
ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. భూమి.. భుక్తి.. విముక్తి కోసం అమరుల పోరాటం చిరస్మరణీయం జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక

మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వారు ఈ నెల 23వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా చైర్పర్సన్ స్థానానికి పోటీ చేసిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 23వ తేదీ ప్రమాణస్వీకారం చేసి చైర్మన్ పీఠాన్ని అధిష్టించనున్నారు. కౌన్సిలర్లు గా విజయం సాధించిన వారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం వైస్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. ఈ కార్యక్రమానికి అతిధిగా మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరును మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయించారు. అనంతరం 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోగా చైర్మన్  పదవి గిరిజన మహిళకు రిజర్వు కావడంతో రాగి వనమ్మ చైర్మన్ పదవిని చేపట్టి ఐదేళ్లు కొనసాగారు. అనంతరం ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన గోపారం వెంకటరమణమ్మ గిరిజన మహిళగా చైర్ పర్సన్ స్థానాన్ని అధిష్టించారుm మున్సిపాలిటీ ఏర్పడ్డాక మూడోదఫా మహిళగా తెలుగుదేశం తరఫున ఇటీవల విజయం సాధించిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా చైర్ పర్సన్ స్థానాన్ని అధిష్టించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో డాక్టర్ షకీలా తెలుగుదేశం అభ్యర్థిగా చైర్పర్సన్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా తెలుగుదేశం అభ్యర్థులు 12 చోట్ల, జనసేన అభ్యర్థులు నాలుగు చోట్ల, బిజెపి అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు. పది చోట్ల వైసిపి అభ్యర్థులు, వారి పొత్తుతో ఒకచోట సిపిఎం అభ్యర్థి విజయం సాధించారు. ఒకటో వార్డు నుండి జనసేన అభ్యర్థి కే. శాంత కుమార్, ఆరో వార్డు నుండి కత్తి పద్మజ, 11వ వార్డు నుండి కొలగాని శిరీష, 12వ వార్డు నుండి గడ్డం సంధ్య జనసేన తరఫున విజయం సాధించారు. పదో వార్డు నుండి అరిటాకుల కృష్ణవేణి ఏకగ్రీవంగా తెలుగుదేశం తరఫున విజయం సాధించారు. నాలుగో వార్డ్ నుండి షేక్ షాహీన్, ఐదో వార్డ్ నుండి షేక్ నాయబ్ రసూల్,ఏడో వార్డు నుండి పొన్నూరు హరికృష్ణ, ఎనిమిదో వార్డ్ నుండి ఎస్ డి మోబినా,13వ వార్డు నుండి తోడేటి మాధవిలత, 14వ వార్డు నుండి పచ్చిపాల హరిత, 15వ వార్డు నుండి షేక్ మొహిబుల్లా, 16 వ వార్డు నుండి షేక్ ఖైరున్నీసా,24 వ వార్డు నుండి తుమ్మల చంద్ర రెడ్డి, 27వ వార్డు నుండి చెరుకూరు పద్మావతమ్మ, 28వ వార్డు నుండి తోగుంట స్వప్నాలు తెలుగుదేశం అభ్యర్థులుగా విజయం సాధించారు. రెండో వార్డ్ నుండి ఆండ్రా సుబ్బారెడ్డి, తొమ్మిదో వార్డు నుండి నాగులపాటి సప్న, 17వ వార్డు నుండి ఎండి దిల్షాద్, 18వ వార్డు నుండి ఎన్ ఆదిలక్ష్మి,19వ వార్డు నుండి పి సర్దార్ ఖాన్,20వ వార్డు నుండి మల్లెంకొండయ్య, 22వ వార్డు నుండి కావాటి సుగుణమ్మ, 23వ వార్డు నుండి నందవరం ప్రసాద్, 25వ వార్డు నుండి యల్లంటి కల్పన, 26వ వార్డు నుండి మాదాల కృపాకర్ నాయుడువైసీపీ తరఫున విజయం సాధించారు. వైసిపి పొత్తుతో 21వ వార్డు నుండి పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి కొప్పోలు సత్యవతి విజయం సాధించారు. వీరంతా ఈ నెల 23వ తేదీ ప్రమాణస్వీకారం చేసి కౌన్సిలర్లు గా తమ బాధ్యతలను కొనసాగించనున్నారు.