ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో..
నరసన్నపేట, సూర్య : మండలంలోని నడగాం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ చెరువు వద్ద ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా చేపడుతున్న పిచ్చిమొక్కల తొలగింపు పనులను మంగళవారం నరసన్నపేట మండల డిప్యూటీ ఎంపీడీవో, నరసన్నపేట మేజర్ పంచాయతీ పంచాయతీ కార్యనిర్వాహక అధికారి పిల్ల జగన్ మోహనరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కోల అప్పలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో జరుగుతున్న పిచ్చిమొక్కల తొలగింపు పనుల పురోగతిని, పనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, నీటి వనరుల చుట్టూ పేరుకుపోయిన పిచ్చిమొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని సిబ్బందికి సూచించారు. పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, పరిసరాల్లో దోమల వ్యాప్తికి అవకాశం లేకుండా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, చేపట్టిన పనులకు సంబంధించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.