BREAKING
నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్!

గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Select Suryaa Now
గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

శ్రీకాకుళం, సూర్య : జిల్లాలో నవంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రజా ప్రతినిధులు, పాఠకులు, ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరికట్ల విఠల్‌రావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయ అధికారులతో నిర్వహించిన సన్నాహక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసినందున నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు ఘనంగా చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, అక్కడి శాఖా గ్రంథాలయ నిర్వాహకులు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలకు, వివాదాలకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
వారోత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు, బడ్జెట్ కేటాయింపులపై సిబ్బంది ప్రస్తావించగా, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని విఠల్‌రావు హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించేలా ప్రత్యేక పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు రూపకల్పన చేసి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.వి.జి.ఎస్. శంకర్రావు, జిల్లాలోని వివిధ ప్రాంతాల గ్రంథాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.