BREAKING
జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..!

బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

Select Suryaa Now
బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

నెల్లూరు,  కలెక్టరేట్,  మేజర్ న్యూస్  :   రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న బియ్యం, వరి నిల్వల వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఈ నెల 27వ తేదీన విజయవాడలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బియ్యం ధరల నియంత్రణ, మార్కెట్ పరిస్థితులు, సరఫరా వ్యవస్థపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం BPT-3291 (సోనా), BPT-5204 (సాంబా), KNM రకాల బియ్యం కిలో ₹66, HMT, RNR రకాలు ₹76, జై శ్రీరామ్ రకం ₹82, MTU సాధారణ రకాలు కిలో ₹47గా నిర్ణయించినట్లు సమావేశంలో పేర్కొన్నారు.  జిల్లాలోని ప్రతి రైస్ మిల్లర్, వ్యాపారి తమ వద్ద ఉన్న వాస్తవ నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్ https://foodstock.dfpd.gov.in లో ఈ నెల 13వ తేదీలోగా నమోదు చేయాలని సూచించారు.  బాస్మతి బియ్యం, నాన్-బాస్మతి ప్రీమియం బియ్యం, సాధారణ రకం బియ్యం, ఉప్పుడు బియ్యం, నూకలు, వరి ధాన్యం తదితర ఆరు కేటగిరీల్లో నిల్వల వివరాలను విడివిడిగా నమోదు చేయాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నిల్వల వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని, కొనుగోళ్లు, అమ్మకాలు, మిల్లింగ్ తదితర లావాదేవీల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.  ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించి బియ్యం నిల్వల వివరాల నమోదును గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.