ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు షేక్ బషీర్ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిదపా విజయం సాధిస్తున్నారని ఓటమి ఎరుగని కుటుంబంగా అందరూ చర్చించుకుంటున్నారు. అనాదిగా బషీర్ నాయకుడిగా ఉండగా ఆయన పోటీ చేయకున్నా ఆయన సతీమణి రజియాబీ రెండు దఫాలు ఎంపీటీసీ మెంబర్గా,ఒక దెబ్బ మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి విజయం సాధించారు.ఈదపా ఎన్నికల్లో బషీర్ కుమారుడైన షేక్ మొహిబుల్లా 15వ వార్డు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం మీద బషీర్ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిదపా విజయం సాధిస్తున్నారని ఓటమి ఎరుగని కుటుంబంగా నిలిచిందని చర్చించుకుంటూ వారిని అభినందిస్తున్నారు.