BREAKING
నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్!

నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం

Select Suryaa Now
నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం

భోగాపురం, సూర్య : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిలో విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు, క్రమశిక్షణను పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీ సాయి నారాయణ జూనియర్ కళాశాల డైరెక్టర్ తిరుమరెడ్డి సుధీర్ తెలిపారు. కళాశాల ప్రారంభమై ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులకు చక్కని విద్యను అందించడంలో విజయం సాధించామని, ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బోధనా విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా ప్రతి సబ్జెక్టుపై సమగ్ర అవగాహన కల్పించేందుకు అనుభవం, నైపుణ్యం కలిగిన అధ్యాపకులను నియమించినట్లు తెలిపారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా, ప్రతి విద్యార్థిలో సబ్జెక్టుపై పట్టు, ఆలోచనా సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
తొలి విద్యా సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా నాణ్యమైన బోధన, మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, భోగాపురం మండలానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ వ్యవస్థాపకుడు పైల రాజు ప్రోత్సాహంతో పిన్నింటిపాలెం గ్రామానికి చెందిన అవ్వ పూజిత అనే విద్యార్థినికి ఉచిత విద్య అందించేందుకు కళాశాల ముందుకు వచ్చినట్లు సుధీర్ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ సతీష్, అధ్యాపకులు శిరీష, అప్పలనాయుడు, శివప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.