కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో
నెల్లూరు,కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగర పాలక సంస్థ పరిధిలోని కీలకమైన పొగతోట,ఆచారి వీధి, కొరడా వీధి, గాంధీ బొమ్మ, కాపు వీధి, మండపాల వీధి, శిఖరం వారి వీధి పలు ప్రాంతాల్లో కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ వసూళ్లకు సంబంధించి ఈ ప్రాంతాల్లో కార్పొరేషన్ కు భారీ స్థాయిలో రాబడి రావాల్సినప్పటికీ కొందరు అధికారుల చేతివాటం వల్ల కార్పొరేషన్ రాబడి కి గండి వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు పొగతోట ప్రాంతంలో అనేక వాణిజ్య, ఆస్పత్రులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో చాలాచోట్ల ఆస్తిపన్నుకు సంబంధించి ఇష్టానుసారంగా పన్నులు వేసినట్లు విమర్శల వినొస్తున్నాయి. కొంతమంది అడ్మిన్లు పెద్ద మొత్తంలో లాభం పొందుతున్నట్లు సమాచారం. వాణిజ్య ప్రాంతాల్లో చాలా షాపులు పుట్టగొడుగుల ఉన్నాయి. ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూడా రాకుండా వారు ఏదో కొన్ని కార్యక్రమాలకి మొక్కుబడిగా హాజరవుతున్నట్లు సమాచారం. ఆస్తి పన్నుకు సంబంధించి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్పొరేషన్ కు రాబడి రావాల్సి ఉంది. అయితే అంత తామే చూసుకుంటామంటూ కొంతమంది వారి ఇష్టానుసారంగా పన్నులు విధిస్తూ కార్పొరేషన్ ఆదాయాన్ని కొల్లగోడుతున్నారనే విమర్శలు వినస్తున్నాయి . కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నతాధికారులను కూడా లెక్కచేయని స్థాయిలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. కార్పొరేషన్ కు లక్షల రూపాయలు ఆస్తి పన్ను రూపంలో రాబడి రావాల్సినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న సిబ్బంది,అధికారులు సక్రమంగా వెళ్ళకపోవడంతో కార్పొరేషన్ కు రాబడి తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతానికి సరైన అధికారుల నియమించి కొత్తవారిని నియమిస్తే కార్పొరేషన్ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. వాణిజ్య ప్రాంతాల్లో చెల్లించవలసిన ఆస్తి పన్ను చాలావరకు చెల్లించకపోవడం విశేషం. ఇకనైనా విజిలెన్స్ అధికారులు ఈ ప్రాంతాల్లో అసెస్మెంట్ లపై దృష్టి పెట్టి ఇక్కడ జరిగిన విషయాలను బయటకు తీస్తే కార్పొరేషన్ రాబడి పెరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఇక్కడున్న అడ్మిన్, రెవెన్యూ సిబ్బందిని కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.