BREAKING
నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్!

విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

Select Suryaa Now
విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

 

మహబూబాబాద్, మేజర్ న్యూస్,
జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు పట్టణంలోని నలంద జూనియర్ కళాశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, మహిళల భద్రత, బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సునంద మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి జీవితంలో రాణించాలని సూచించారు. డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఓటీపీ, ఏటీఎం పిన్ వివరాలను ఇతరులకు వెల్లడించవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930, అత్యవసర సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని సూచించారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే భయపడకుండా షీ టీంను సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గౌస్ పాషా, షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, ప్రియాంక, ఏహెచ్‌టీయూ సిబ్బంది ఏఎస్ఐ రాజు, అరుణ, సుప్రజ పాల్గొన్నారు.

రిపోర్టర్; మహేష్, మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా