ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ - ఈ నెల 30లోగా పెండింగ్ ఫీజులు చెల్లించాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా
సూర్య కరీంనగర్ ప్రతినిధి : ఎల్ఆర్ఎస్–2020 కింద దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించిందని, ఈ అవకాశాన్ని అర్హులైన దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. రాయితీ పోను మిగిలిన రెగ్యులరైజేషన్ ఫీజులను ఈ నెల 30వ తేదీలోగా చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 71,454 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 11,514 దరఖాస్తులు ఆమోదం పొందినట్లు తెలిపారు. పెండింగ్ దరఖాస్తుదారులకు రాయితీ, ఫీజుల చెల్లింపు గడువుపై గ్రామాల వారీగా సమాచారం అందించాలని, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని డీపీఓ జగదీశ్వర్‌ను ఆదేశించారు.