BREAKING
జలసంరక్షణ పనులకు పెద్దపీట వేయాలి - జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ.... నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి... అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి .

తూర్పుగోదావరి జిల్లాలో ఐటి హబ్ గా తీర్చిదిద్దాలి

Select Suryaa Now
తూర్పుగోదావరి జిల్లాలో ఐటి హబ్ గా తీర్చిదిద్దాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పు గోదావరి జిల్లాను సమాచార సాంకేతిక రంగంలో అభివృద్ధి చేసి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఐటీ మేనేజర్ సంతోష్ కుమార్ సి. జిల్లాలో ఐటీ పరిశ్రమల స్థాపనకు సంబంధించి చేపడుతున్న కార్యాచరణ, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఐటీ కంపెనీలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి, పెట్టుబడులను ఆకర్షించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఐటీ రంగంలో నైపుణ్యాలు కలిగిన స్థానిక యువతకు సొంత జిల్లాలోనే ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న జిల్లాకు చెందిన ఐటీ నిపుణులు తమ సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కల్పించేలా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలన్నారు.స్థానికంగా ఉపాధి పెరగడంతో పాటు జిల్లా ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుందని పేర్కొన్నారు.ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు, వాణిజ్య భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సమగ్రంగా గుర్తించి డిజిటలైజ్ చేయాలని  ఆదేశించారు. పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు సకాలంలో మంజూరయ్యేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యాచరణను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా ఐటీ మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐటీ ఇన్‌ఫ్రా కనెక్ట్ పోర్టల్ ద్వారా జిల్లాలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాణిజ్య స్థలాలు, నిర్మిత భవనాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ భూముల వివరాలను సేకరించి డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో స్థలం, భవనాలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం పెట్టుబడిదారులకు ఒకే వేదికపై లభిస్తుందని వివరించారు.ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు జిల్లాలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అనుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వాణిజ్య భవనాల యజమానులు, ఖాళీ స్థలాలు కలిగి ఐటీ పరిశ్రమలకు లీజుకు లేదా విక్రయించేందుకు ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను ఐటీ ఇన్‌ఫ్రా కనెక్ట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. పోర్టల్ వివరాలు ఐటీ మేనేజర్‌ను 9493908424 నంబరులో సంప్రదించాలని సూచించారు.