మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి...
గార, సూర్య : గార మండలం వమరవెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డి మృతి పట్ల యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆయన మధు రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్థివదేహాన్ని స్వయంగా మోస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మధు రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మధు రెడ్డి మరణం పార్టీకి, స్థానిక ప్రాంతానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ అంతిమయాత్రలో పుల్లటి నాగేశ్వరరావు, గొండు జయరాం, చల్ల రవికుమార్, ముంజేటి కృష్ణ, మార్పు పృథ్వీ, కొయ్యన నాగభూషణ్, రఘునాథరెడ్డి, బుజ్జి, సాయి, గోవింద తదితరులతో పాటు గ్రామానికి చెందిన యువత, మహిళలు, పెద్దసంఖ్యలో గ్రామస్థులు పాల్గొని మధు రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు.