BREAKING
ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. భూమి.. భుక్తి.. విముక్తి కోసం అమరుల పోరాటం చిరస్మరణీయం జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక

జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   జనగణన సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు అధికారులకు సూచించారు.  మంగళవారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జిల్లా సెన్సెస్ అధికారులు, మండల స్థాయి చార్జ్ ఆఫీసర్లు, మదనపు ఛార్జ్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనాభా గణన 2027 పై నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రశ్నావళిలోని 1 నుంచి 40 ప్రశ్నలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, ప్రతి ప్రశ్నకు ఒకే ప్రామాణిక విధానంలో సమాధానాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రశ్నల నమోదులో వ్యక్తిగత విచక్షణకు తావులేకుండా, ఎలాంటి సందేహాలున్నా శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.  సెల్ఫ్ ఎన్యుమరేషన్, ఇంటింటి సర్వే, రివిజనల్ రౌండ్‌లను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలన్నారు. మొదటి రోజు నుంచే ప్రతి ఎన్యుమరేటర్ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని విధులు నిర్వహించాలని, చివరి రోజుల్లో హడావుడి పడకుండా నిరంతరం పురోగతిని పర్యవేక్షించాలన్నారు. రోజుకు సగటున నాలుగు నుంచి పది ఇళ్ల వివరాలను నమోదు చేయడం ద్వారా నిర్ణీత సమయంలో సర్వేను పూర్తి చేయవచ్చని తెలిపారు. 2027 జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్ లో వివరాల నమోదు, 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు హౌస్ టు హౌస్ ఫీల్డ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు.  సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలు, టిడ్కో గృహ సముదాయాలపై ప్రత్యేక దృష్టి సారించి క్లస్టర్ల వారీగా ప్రచారం నిర్వహించి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత జనగణన డిజిటల్ విధానంలో జరుగుతున్నందున వివరాలను నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒకసారి వివరాలను నమోదు చేసి సమర్పించిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదని గుర్తుచేశారు. సేకరించిన సమాచారం ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, భవిష్యత్ విధానపరమైన నిర్ణయాలు రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. డేటా నమోదు కచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ప్రతి కార్యాలయంలో ప్రత్యేక డేటా వెరిఫికేషన్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  కుల, మత వివరాల నమోదులో ప్రభుత్వ నిబంధనలు, గెజిట్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వివరాలు నమోదు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే తహసీల్దార్లు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.  సర్వే విధులకు కేటాయించిన సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా పర్యవేక్షక అధికారులు చర్యలు తీసుకోవాలని, మొదటి రెండు మూడు రోజుల్లోనే ప్రతి ఎన్యుమరేటర్ సర్వే ప్రారంభించేలా నిర్ధారించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, అదనపు కమిషనర్ హిమబిందు, సిపిఓ లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు.