BREAKING
రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి... అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి . జనసేన రాష్ట్ర నాయకులను కలిసిన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు కాల్వ ఎంపీటీసీల విజయోత్సాహం.. కాటసాని దంపతులకు ఘన సత్కారం! వంద శాతం విద్యార్థుల ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి_ఎంఈఓ బషీర్ అహ్మద్ వైఎస్సార్‌సీపీలోకి 20 కుటుంబాల చేరిక రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు తాడిబిలోలి విద్యార్థులు ఎంపిక సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

డైట్ లో అధికారుల సందర్శన

Select Suryaa Now
డైట్ లో అధికారుల సందర్శన

నెల్లిమర్ల, సూర్య : వేణుగోపాలపురం ​ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో బోధనా ప్రమాణాలు, విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు రెండు జిల్లాల నుంచి అధ్యాపక బృందాలు సందర్శించాయి. ఒమర వల్లి డైట్ ప్రిన్సిపాల్  గౌరీశంకర్ ఆధ్వర్యంలో నలుగురు అధ్యాపకులు, భీముని పట్నం డైట్ ప్రిన్సిపాల్  బి. సునీత ఆధ్వర్యంలో మరో నలుగురు అధ్యాపకుల బృందాలు విచ్చేశాయి. అకడమిక్ క్యాలెండర్ అమలు, ఛాత్రోపాధ్యాయుల బోధనా ప్రమాణాలు, ల్యాబ్‌లు, ఈ-కంటెంట్, గ్రంథాలయం, బోధనాభ్యసన సామగ్రిని పరిశీలించారు. ​ లెక్చరర్ రమేష్ రూపొందించిన 'డైట్ మేట్'  యాప్ పనితీరును, సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని సందర్శక బృందాలు ప్రత్యేకంగా అభినందించాయి. ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్  కె. రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు పాల్గొని సంస్థ కార్యకలాపాలను వివరించారు. ​ఈ అనుభవాల మార్పిడి ఉపాధ్యాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరచుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.