BREAKING
ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. భూమి.. భుక్తి.. విముక్తి కోసం అమరుల పోరాటం చిరస్మరణీయం జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక

కాల్వ ఎంపీటీసీల విజయోత్సాహం.. కాటసాని దంపతులకు ఘన సత్కారం!

Select Suryaa Now
కాల్వ ఎంపీటీసీల విజయోత్సాహం.. కాటసాని దంపతులకు ఘన సత్కారం!

కాల్వ ఎంపీటీసీల విజయోత్సాహం.. కాటసాని దంపతులకు ఘన సత్కారం!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

కాల్వ గ్రామంలో ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో గ్రామ పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా కాల్వ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు.

కాల్వ ఎంపీటీసీ-1గా అలీ బాషా, ఎంపీటీసీ-2గా మద్దిలేటి నాయక్ విజయం సాధించిన నేపథ్యంలో కాటసాని దంపతులకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్‌రెడ్డి విజయం సాధించిన ఎంపీటీసీలను ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విజయం అందరి సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాల్వ, గుడుంబాయి తండా గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.