BREAKING
ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. భూమి.. భుక్తి.. విముక్తి కోసం అమరుల పోరాటం చిరస్మరణీయం జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక

సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

Select Suryaa Now
సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

పెరవలి మేజర్ న్యూస్ 'మురసు', 'అర్నాబ్' తుఫాన్ల దాటికి తూర్పు గోదావరి జిల్లాతో పాటు ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గ రైతాంగం తీవ్రంగా దెబ్బతిని ఆవేదనలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నవంబర్ 10వ తేదీ మంగళవారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లాతో పాటు నిడదవోలు నియోజకవర్గంలో ప్రకృతి వైపరీత్యం సృష్టించిన బీభత్సాన్ని, రైతుల కష్టాలను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ముందు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా తుఫాన్ల ఉధృతికి తోడు ఎర్రకాలువ పొంగిపొర్లడంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయని చేతికొచ్చిన పంట పూర్తిగా నాశనమై రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని తెలిపారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజల జనజీవనం స్తంభించిపోయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పంట ఇన్సూరెన్స్ కొద్దిమందికే ఉన్నందున, ఇన్సూరెన్స్ లేని రైతులను కూడా మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకుని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకూ ప్రభుత్వ పరిహారం అందించాలని విన్నవించారు..తుఫాన్ తో పాటు ఎర్రకాలువ వరద వల్ల దెబ్బతిన్న పంటలు, ఇళ్ల నష్టాన్ని తక్షణమే అంచనా వేసి (ఎన్యుమరేషన్), నిబంధనలకు అతీతంగా అర్హులైన ప్రతి రైతునూ జాబితాలో చేర్చాలని కోరారు.నిడదవోలు నియోజకవర్గ రైతాంగాన్ని, ప్రజలను అన్ని విధాలా ఆదుకుని కొండంత అండగా నిలవాలని మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి చేయగా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ తెలిపారు.