telangana
కోలాహలంగా దండారి వేడుకలు – పాల్గొన్న సర్పంచ్ కల్పన సునీల్ జాదవ్
సూర్య ఉట్నూర్ : భీమ్ గూడ గ్రామంలో దండారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ కల్పన సునీల్ జాదవ్, ఉప సర్పంచ్ రజిత, వార్డు సభ్యులు శ్రీహరి, భూమన్నలతో పాటు గ్రామ ప్రజలందరూ విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలకు దండారి ఉత్సవాలు ప్రతీక అని, గ్రామంలో ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు, యువకులు కోలాటాలు, నృత్యాలతో హోరెత్తించారు. కార్యక్రమానికి హాజరైన నాయకులు మరియు గ్రామస్తులతో దండారి వేడుకలు గ్రామంలో మరింత శోభను సంతరించుకున్నాయి.