BREAKING
నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్!

బీజేపీ మండల కమిటీల నియామకం

Select Suryaa Now
బీజేపీ మండల కమిటీల నియామకం

నవాబుపేట సూర్య న్యూస్: నవాబుపేట మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో వివిధ విభాగాల మండల అధ్యక్షులు,పార్టీ పదాధికారులను నియమించారు.ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు.ఈ నియామకాల్లో భాగంగా మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా కొల్లూరుకు చెందిన కృష్ణారెడ్డి,పార్టీ కార్యదర్శిగా జంగమయ్యపల్లికి చెందిన ఉప సర్పంచ్ శ్రీనివాసులు,యువజన విభాగం మండల అధ్యక్షుడిగా కేశవరావుపల్లికి చెందిన నరేష్ యాదవ్,మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా లోకిరేవుకు చెందిన రజిని శ్రీనివాస్ నియమితులయ్యారు.అలాగే నవాబుపేట పట్టణ అధ్యక్షుడిగా చిర్ప నరేష్ ముదిరాజ్,ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడిగా యన్మనగండ్లకు చెందిన రమేష్,రైతు విభాగం మండల అధ్యక్షుడిగా కాకర్లపహాడ్‌కు చెందిన పాశం నర్సింహులు,వెనుకబడిన తరగతుల విభాగం మండల అధ్యక్షుడిగా రుద్రారానికి చెందిన సంద రమేష్ ముదిరాజ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ అభివృద్ధికి,బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు,పాశం నరేందర్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.