BREAKING
జలసంరక్షణ పనులకు పెద్దపీట వేయాలి - జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ.... నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి... అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి .

నెల్లిమర్లలో ఉపాధ్యాయుడు హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి

Select Suryaa Now
నెల్లిమర్లలో ఉపాధ్యాయుడు హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి

నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో గిరిజన ఉపాధ్యాయుడు కుమరాపు సోమన్నదొర హత్యకు గురైన ఘటన తీవ్ర బాధాకరమని మైదాన ప్రాంత గిరిజన నిరుద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు రఘుపతుల శశిభూషణ్ అన్నారు.  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, హత్యకు గల పూర్తి కారణాలను వెలికితీసి, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయుడిపై ప్రశాంతంగా ఉండే నెల్లిమర్లలో ఇలాంటి దారుణమైన హత్య సంఘటన జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదని, జీవించే హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని ఇలాంటి ఘటనలు వల్ల సమాజంలో మానవతా విలువలు క్షీణిస్తున్నాయని అయన ఆందోళన వ్యక్తం చేసారు. ఈ హత్య ఘటనపై పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నిందితులను గుర్తించి  కఠినంగా శిక్షించాలని,  బాధిత ఉపాధ్యాయుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, తగిన న్యాయం,  అవసరమైన ఆర్థిక సహాయం అందించాల విజ్ఞప్తి చేశారు.