BREAKING
ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ.... నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి... అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి . జనసేన రాష్ట్ర నాయకులను కలిసిన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు

ఎన్నికల ఫలితాల తర్వాత ఆరోపణలా.. ప్రజాతీర్పును గౌరవించాలి!

Select Suryaa Now
ఎన్నికల ఫలితాల తర్వాత ఆరోపణలా.. ప్రజాతీర్పును గౌరవించాలి!

బాడంగి, సూర్య : ఎన్నికలు ముగిసి ప్రజాతీర్పు వెలువడిన తర్వాత ఆరోపణలు, విమర్శలకు దిగడం సమంజసం కాదని టీడీపీ మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు అన్నారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం టీడీపీపై విమర్శలు చేయడం తగదని వైసీపీ మండల అధ్యక్షుడు యమల శివప్రసాద్‌కు హితవు పలికారు. ప్రజాతీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని స్పష్టం చేశారు.ఎన్నికల పోలింగ్ సమయంలో వైసీపీకి చెందిన ఏజెంట్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే ఉన్నారని, ఎన్నికల ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందన్నారు. పోలింగ్ రోజున జరిగిన పరిణామాలు, తమ పార్టీ ఏజెంట్లకు తెలిసిన వాస్తవాలను తెలుసుకోకుండా ఎన్నికల అనంతరం ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ముగడ గ్రామంలో మొదటి నుంచీ టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ, కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి ఆ ఎంపీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించామని వివరించారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందిన విషయాన్ని ప్రస్తావిస్తున్న శివప్రసాద్, ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా హుందాగా అంగీకరించాలని సూచించారు. రాజకీయ విమర్శలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.రాజకీయ బలాబలాలను మాటలతో కాకుండా ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాలని తెంటు రవిబాబు సవాల్ విసిరారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దించి గెలిపించుకోవాలని, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజల మద్దతు ఎవరికుందో రాబోయే ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తాయని తెంటు రవిబాబు పేర్కొన్నారు.