BREAKING
జలసంరక్షణ పనులకు పెద్దపీట వేయాలి - జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ.... నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి... అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి .

విద్య, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత

Select Suryaa Now
విద్య, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం రెబ్బెన మండలంలో పర్యటించిన ఆమె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు, క్యాష్‌బుక్‌ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని కార్యదర్శిని ఆదేశించారు. గ్రామపంచాయతీ పరిపాలనలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.