ఉమ్మడి గోదావరి లో సానా మార్క్, కూటమి విజయ వ్యూహలను సాన పెట్టిన సానా.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, మరోవైపు ఆర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో ప్రజలకు అండగా నిలవడం.. ఇలా మూడు కీలక బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కోనసీమలో కూటమి విజయానికి కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలాపురం ఎన్నికల పరిశీలకుడిగా సానా సతీష్ బాబును నియమించినప్పటి నుంచి కూటమి విజయమే లక్ష్యంగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎన్నికల నిర్వహణ, పార్టీ సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
సానా వ్యూహం.. కూటమి సమన్వయమే విజయానికి బాట..
అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం, రాజోలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, నామినేషన్లు, ప్రచార వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరిస్తూ ఉమ్మడి కార్యాచరణకు ప్రాధాన్యత ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ కూటమి ఐక్యతను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. స్వయంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల్లో ఉత్సాహం నింపారు.
మూడు మున్సిపాలిటీల్లో విజయం.. 19కి 19 ZPTC స్థానాలు..
ఎంపీ సానా సతీష్ బాబు సమన్వయం, కూటమి నాయకుల ఐక్య కార్యాచరణతో అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కోనసీమ ప్రజలు కూటమిపై తమకున్న విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పారు. ZPTC ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తూ మొత్తం 19కి 19 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. అదేవిధంగా 379 MPTC స్థానాలకు గాను 312 స్థానాల్లో విజయం సాధించింది.
ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ, కోనసీమ ప్రజలు కూటమికి పట్టం కట్టి తమపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. 19కి 19 ZPTC స్థానాలు, 312 MPTC స్థానాలు సాధించడం కూటమిపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. ప్రశాంతమైన కోనసీమలో గత వైసీపీ పాలనలో కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లకు కారణమయ్యారని విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీకి తగిన సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో కోనసీమ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, 2029 ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తుఫాన్ సమయంలోనూ ప్రజల మధ్యే….
ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో ఎంపీ సానా సతీష్ బాబు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. అల్లవరం, గోపాయిలంక, గోడి, బెండమూరిలంక, ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం తదితర గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఓడలరేవు వద్ద తుఫాన్ కారణంగా దెబ్బతిన్న సుమారు 200 బోట్లను పరిశీలించి బాధిత మత్స్యకారులను పరామర్శించారు. రైతులు, మత్స్యకారుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించారు. విద్యుత్, తాగునీరు, రహదారుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రహదారులపై కూలిన చెట్ల తొలగింపు పనుల్లోనూ స్వయంగా పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయ్యే వరకు అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
క్షేత్రస్థాయి సమస్యలను సీఎం దృష్టికి….
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి రైతులు, మత్స్యకారులు ఎదుర్కొన్న నష్టాలు, సమస్యలను ఎంపీ తీసుకెళ్లారు. బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఎన్నికల సమన్వయంతో పాటు తుఫాన్ సమయంలో సహాయక చర్యల్లోనూ ఎంపీ చూపిన చొరవ, బాధ్యతాయుతమైన పనితీరు కోనసీమ ప్రజలతో పాటు ముఖ్యమంత్రి ప్రశంసలు పొందింది.
ఎన్నికల నుంచి ప్రజా సేవ వరకు.. సానా మార్క్!
ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీట్ల సర్దుబాటు, నామినేషన్లు, ప్రచారం, పోలింగ్, ఫలితాల వరకు ప్రతి దశలోనూ కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఎంపీ సానా సతీష్ బాబు కీలక పాత్ర పోషించారు. ఒకవైపు కూటమి భాగస్వామ్య పార్టీలను ఏకం చేయడం, మరోవైపు తుఫాన్ బాధితులకు అండగా నిలవడం ద్వారా తనదైన కార్యాచరణను చాటుకున్నారు. కోనసీమలో కూటమి సాధించిన విజయాల్లో ఆయన సమన్వయ కృషి, వ్యూహాత్మక కార్యాచరణ ప్రత్యేకంగా నిలిచాయి. రాబోయే పంచాయతీ ఎన్నికలు, 2029 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎంపీ తన కార్యాచరణను కొనసాగించనున్నారు.