2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కసరత్తు: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
పలమనేరు మేజర్ న్యూస్ :ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అందించిన ఘన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం పలమనేరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, కొన్ని కాంట్రాక్టు ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సుమారు 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సహకారంతో పలమనేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు,
అనిల్ కుమార్ యాదవ్, పలమనేరు మేజర్ న్యూస్.