BREAKING
డైట్ లో అధికారుల సందర్శన నెల్లిమర్లలో ఉపాధ్యాయుడు హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు - జిల్లా కలెక్టర్ కె.హరిత నందమూరి బాలకృష్ణతో పనిచేయడం అదృష్టం.. ‘దాదా’ షూటింగ్ అనుభవాలు పంచుకున్న సునీల్ రెడ్డి! కొమురం భీం 86వ వర్ధంతికి కలెక్టర్‌ను ఆహ్వానించిన మంగి గ్రామస్తులు ఉమ్మడి గోదావరి లో సానా మార్క్, కూటమి విజయ వ్యూహలను సాన పెట్టిన సానా. తూర్పుగోదావరి జిల్లాలో ఐటి హబ్ గా తీర్చిదిద్దాలి విద్య, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది! ఎన్నికల ఫలితాల తర్వాత ఆరోపణలా.. ప్రజాతీర్పును గౌరవించాలి! తాడ్వాయి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి - ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి ఓటీటీలో అలరించడానికి వస్తున్న రొమాంటిక్ బోల్డ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రేపు నగరం కళాశాలలో జాతీయ సదస్సు

Select Suryaa Now
రేపు నగరం కళాశాలలో జాతీయ సదస్సు

నగరం, మేజర్ న్యూస్: బాపట్ల జిల్లా, మండల కేంద్రమైన నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీలలో “అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ నానో టెక్నాలజీ ఫర్ నెక్స్ట్ జనరేషన్” అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న నూతన మార్పులు, పరిశోధన అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు జరిగే సదస్సులో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, నానోటెక్నాలజీ రంగాలలో ఆధునిక పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అధునాతన పదార్థాల అభివృద్ధి తదితర అంశాలపై నిపుణులు తమ పరిశోధనా అనుభవాలు, అభిప్రాయాలు వివరిస్తారని ఆయన అన్నారు. ఈ జాతీయ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొంటారన్నారు.