తాడ్వాయి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి - ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి
సూర్య తాడ్వాయి :తాడ్వాయి మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్‌మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
తాడ్వాయి మండల పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యేతో చర్చించారు.
ఎమ్మెల్యే హామీ: నాయకులు వివరించిన సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పెండింగ్ పనులను త్వరలోనే ప్రారంభించి, వేగంగా పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షుడు బండారి సంజీవులు మహేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు శ్యామ్ రావు ఎల్ఐసి పిఎస్ సి చైర్మన్ వెంకటరెడ్డి రాజేశ్వర్ రెడ్డి జూకంటి వెంకట్ రెడ్డి మేకల రాజు రంజిత్ రెడ్డి వీడిసి అధ్యక్షుడు రనీల్ రెడ్డి ఉప సర్పంచ్ భరత్ రావు వార్డ్ నెంబర్ శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు