BREAKING
గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి - రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్‌కు ఘన నివాళులు.. కన్నీటి పర్యంతమైన మలయాళ చిత్ర పరిశ్రమ! పంటల సాగులో సేంద్రియ పద్ధతులను పాటించాలి - రైతులకు సహాయ వ్యవసాయ సంచాలకురాలు రాధిక సూచన ఔషధ మొక్కల (అశ్వగంధ, మునగ, తులసి) సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించండి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం కొత్తగూడకు బీటీ రోడ్డు వేయాలి - సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి 36వ రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయాలి విజయ్ దేవరకొండ, రష్మిక జోడీపై విమర్శలు.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు! గర్భిణుల తొలి త్రైమాసిక నమోదు నుంచి ప్రసవం వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి తాళాయికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు, ఫీజుల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి - DYFI డిమాండ్ పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ విరావి ఫస్ట్ లుక్ విడుదల.. పాన్ ఇండియా రేంజ్‌లో మిస్టిక్ థ్రిల్లర్! ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం * గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం * అభివృద్ధికి భరోసా నాది.. అండగా నిలవండి - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అక్కడ తప్పిదాలే రెండు అపజయాలకు మూలం!

రైతులు కూరగాయల పంటను సాగు చేయాలి-కలెక్టర్

Select Suryaa Now
రైతులు కూరగాయల పంటను సాగు చేయాలి-కలెక్టర్

గూడూరు, మేజర్ న్యూస్,:మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట రైతు వేదికలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో "ఎల్ నినో పరిస్థితులలో ఉద్యాన పంటల యాజమాన్యం"పై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎల్ నినో పరిస్థితులను తట్టుకుని రైతులు ఉద్యాన పంటలలో అధిక దిగుబడులు సాధించేందుకు తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ, నీటి నిల్వ పద్ధతులు  సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఎప్పుడూ వరి పంట ను కాకుండా వివిధ రకాల కూరగాయల పంటను రైతులు సాగు చేయాలని అన్నారు.ఈ పంటల సాగు తో అధిక దిగుబడి తో అధిక లాభాలు రైతులు పొందవచ్చు అని, విద్యుత్ ఆదా తో పాటు నీటిని కూడా ఆదా చేయవచ్చు అని అన్నారు.
రైతుల శ్రేయస్సు కోసం ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు భూపతిపేట పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్; యాకుబ్ భాషా ,గూడూరు, మహబూబాబాద్ జిల్లా