BREAKING
కొక్కొరొకో గ్లింప్స్ విడుదల.. శీను, పార్వతి అందమైన ప్రేమకథతో ఆకట్టుకుంటున్న రమేష్ వర్మ కొత్త సినిమా! రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడిగా కడారి బాబు ఎమ్మెల్యే బేబినాయన ను కలిసిన నూతన వార్డు కౌన్సిలర్లు నాపై నమ్మకంతో పదవి ఇచ్చిన పెద్దలకు పేరు పేరునా ధన్యవాదాలు ఆర్టీసీ డిపో సమస్యలను పరిష్కరించాలి బాలికల భద్రతపై అవగాహన ఉండాలి యుపిఎస్‌సి తరహాలో టిజిపిఎస్‌సి పునర్వ్యవస్థీకరణ: సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ హామీలన్నీ గాలికే-బత్తిని శ్రీనివాస్ గౌడ్ నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి..మండల సభలో సర్పంచుల వినతి వికసిత్ భారత్ యువజన పార్లమెంట్ పోటీలు విజయవంతం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ పట్టభద్రుల గొంతుకగా అవకాశం ఇవ్వండి... వ్యసనాలకు దూరంగా విజ్ఞానానికి దగ్గరగా ఉండాలి టిడ్కో గృహాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అక్కడ తప్పిదాలే రెండు అపజయాలకు మూలం!

Select Suryaa Now
అక్కడ  తప్పిదాలే రెండు అపజయాలకు మూలం!

గుర్ల, సూర్య : గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో నేతలు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు రెండు అపజయాలకు కారణమయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పెనుబర్తి ఎంపీటీసీ పరిధిలో వెలువడిన ఫలితాలు టీడీపీ నేతల వ్యూహాత్మక తప్పిదాలను స్పష్టంగా బయటపెట్టాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ తరఫున తొలుత ఒక అభ్యర్థిని నామినేషన్ వేయాలని ప్రోత్సహించిన పార్టీ నేతలు, కొద్ది రోజులకే మరో అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంతో మొదటి అభ్యర్థి అసంతృప్తికి గురయ్యారు.గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ విజయానికి కృషి చేస్తూ, ఎన్నికల కోసం సిద్ధమవుతున్న తనను ఒక్కసారిగా పక్కన పెట్టడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.దీంతో గ్రామంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండటంతో టీడీపీ ఓట్లు రెండుగా చీలిపోయాయి. దీంతో వైఎస్సార్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించడానికి మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెబల్ అభ్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్లను చీలుస్తారని భావించిన టీడీపీ నేతల అంచనాలు తలకిందులై, సొంత పార్టీ ఓట్లే చీలి అపజయానికి కారణమయ్యాయని పలువురు నాయకులు చర్చించుకుంటున్నారు.
పెనుబర్తి, చింతలపేట, గంగిరెడ్డిపేట గ్రామాల పరిధిలో మొత్తం 2,382 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీ అభ్యర్థికి 787, టీడీపీ రెబల్ అభ్యర్థికి 706, వైఎస్సార్ పార్టీ అభ్యర్థికి 877 ఓట్లు వచ్చాయి. మిగిలిన 112 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. దీంతో వైఎస్సార్ పార్టీ అభ్యర్థి 93 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అయితే ఇక్కడ టీడీపీ తరఫున ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కలిపితే 1,490 అవుతాయి. Lఈ లెక్కన వైఎస్సార్ పార్టీ అభ్యర్థిపై టీడీపీకి 610 ఓట్ల ఆధిక్యం లభించే అవకాశం ఉండేదని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇక జడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి విజయానికి అవకాశాలు మెండుగా ఉండేవని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మండలంలో ప్రస్తుతం టీడీపీకి చెందిన 8 మంది, ఒక స్వతంత్ర అభ్యర్థి, వైఎస్సార్ పార్టీకి చెందిన 9 మంది ఎంపీటీసీలు గెలుపొందడంతో ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పెనుబర్తిలో టీడీపీ రెబల్ అభ్యర్థి పోటీలో లేకుండా ఉండి ఉంటే, ఆ ఎంపీటీసీ స్థానం కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉండేదని, తద్వారా ఎంపీపీ పీఠం విషయంలో పార్టీకి రాజకీయంగా కలిసివచ్చేదని నాయకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు ముందు నేతలు తీసుకున్న నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపికలో జరిగిన తప్పిదాలు నేడు పార్టీకి తలనొప్పిగా మారాయని, పరోక్ష నిర్ణయాలతో రెండు విజయావకాశాలను చేజార్చుకున్నామనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.