టిడ్కో గృహాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టిడ్కో భవనాలకు ఎదురుగా ఉన్న లేఅవుట్ పక్కన సుమారు 50 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని పురుష వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు, చిరునామా, కుటుంబ సభ్యులు మరియు ఇతర వివరాలు తెలియరాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం సదరు వ్యక్తి యాచకుడిగా జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. మృతుని వయస్సు సుమారు 50 నుండి 55 సంవత్సరాలు ఉంటుందని, సన్నని శరీర నిర్మాణం కలిగి ఉన్నాడని,జుట్టు: నల్లటి రంగులో, కొద్దిగా పొడవుగా, ఒత్తుగా ఉన్న జుట్టు కలిగి ఉన్నాడని,తెలుపు మరియు నలుపు రంగులు కలిసిన ఒత్తైన, పొడవైన గడ్డం కలిగి ఉన్నాడని, తెలుపు, నలుపు రంగులు కలిసిన మీసాలు కలిగి ఉన్నాడని, లేత గోధుమ రంగు నేపథ్యంలో నీలం, తెలుపు రంగుల గళ్లతో కూడిన హాఫ్ స్లీవ్స్ షర్టు ధరించి ఉన్నాడని, నలుపు రంగు ఫుల్ ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహంపై పైకి కనిపించే విధంగా ఎటువంటి బాహ్య గాయాలు లేవని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మృత వ్యక్తిని ఎవరైనా గుర్తించినా, అతని పేరు, చిరునామా, స్వగ్రామం, కుటుంబ సభ్యులు లేదా బంధువులకు సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసినా వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించవలసిందిగా కోరారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు 9440796390 నెంబర్ ద్వారా తెలియజేయాలని వారు కోరారు.