BREAKING
20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..... సింగరకొండకు తెదేపా శ్రేణుల పాదయాత్ర. *1వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన మల్లి వెంకటరమణమ్మకు మాజీ మంత్రి నల్లపరెడ్డి అభినందనలు... మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు ఆర్.కే. విద్యాలయానికి జాతీయ గౌరవం - సుమైరాకు కాంస్య పతకం "కాకాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు" ఎల్లమ్మ ఆలయంలో కార్తీక పూజలు.. శ్రీ సర్వమంగళ దేవిగా ఎల్లమ్మ దర్శనం... మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా? 15 ఎంపీటీసీ స్థానాల్లో కూటమికి 12 స్థానాలు అధికార బలానికి ఎదురొడ్డి.. సర్వేపల్లి లో ఉనికిని చాటుకున్న వైఎస్ఆర్సిపి... చిలుకూరు అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అన్న దానం పాము కాటుకి గురైన వ్యక్తి మృతి 21న సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం శ్రీజ తండ్రి యాదగిరి రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల... సీజనల్ వ్యాధులకు హోమియోపతిలో ప్రత్యేక మందులు డా కరుణాకర్

మైలవరం అభివృద్ధికి మరింత ప్రాధాన్యత

Select Suryaa Now
మైలవరం అభివృద్ధికి మరింత ప్రాధాన్యత

మైలవరం, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి మరింత ప్రాధాన్యతనిస్తూ, కొండపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ఐతవరంలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జంపాల సీతారామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై ఉన్న నమ్మకంతోనే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తక్కువగా పర్యటించానని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కృష్ణప్రసాద్‌ను అభినందించారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన పాతతరం నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తూ కొత్తవారిని కూడా కలుపుకొని ముందుకు సాగడం అభినందనీయమన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో కూటమి విజయం వెనుక మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి ఉందని, పరస్పర సమన్వయం వల్లే 95 శాతం విజయాల రేటు సాధ్యమైందని పేర్కొన్నారు. కూటమి పార్టీల మధ్య ఐక్యతను కొనసాగించడంలో గద్దె అనురాధ, సామినేని ఉదయభాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని, ముఖ్యంగా కొండపల్లి ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కారానికి తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా పనిచేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు విజయం మాత్రమే కాదని, అది ప్రజాప్రతినిధులపై ఉంచిన బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు సూచించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.