BREAKING
ఎంపీపీలు, జెడ్పీటీసీల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ* ఇంకుడు గుంతలను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వరి ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలి ప్రభుత్వ పథకాలలో దళారులను నమ్మవద్దు - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంకా ఏం అనుకోలేదు చిత్రానికి మేఘాలు సంద్రంలో మెలోడీ సాంగ్ లాంచ్.. డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గించేందుకు ఫీల్డ్ ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించాలి ఈ నెల 21వ తేదీలోగా ఇన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి - అదనపు కలెక్టర్ విక్టర్ బెజ్జూర్ ఎస్సైని శాలువాతో సన్మానించిన ఎంఆర్పీఎస్ నాయకులు గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి - రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్‌కు ఘన నివాళులు.. కన్నీటి పర్యంతమైన మలయాళ చిత్ర పరిశ్రమ! పంటల సాగులో సేంద్రియ పద్ధతులను పాటించాలి - రైతులకు సహాయ వ్యవసాయ సంచాలకురాలు రాధిక సూచన ఔషధ మొక్కల (అశ్వగంధ, మునగ, తులసి) సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించండి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం కొత్తగూడకు బీటీ రోడ్డు వేయాలి - సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి

జగన్ కు షాక్ ..పార్టీకి ముఖ్య నేత గుడ్ బై

Select Suryaa Now
జగన్ కు షాక్ ..పార్టీకి ముఖ్య నేత గుడ్ బై
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ శాస్త్రవేత్త అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన పదవులకు రాజీనామా చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానాలపై, పార్టీ అంతర్గత వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న నూతన రాజకీయ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.

అమెరికాలో ఫార్మసీ, క్లినికల్ రీసెర్చ్ రంగాల్లో సైంటిస్టుగా ఉన్నత స్థాయిలో స్థిరపడి, కేవలం ప్రజా సేవ చేయాలనే తపనతో మాతృభూమికి తిరిగి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్ కేవలం 'వైఎస్సార్ కొడుకు' అనే బ్రాండ్‌ను మాత్రమే వాడుకున్నారని, నాయకత్వ లక్షణాలు మరియు రాజకీయ పరిపక్వత చూపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తాడేపల్లి నివాసం చుట్టూ అలుముకున్న కోటరీ వ్యవస్థ వల్ల పార్టీకి తీరని నష్టం జరిగిందని, శ్రేణులకు నాయకుడు అందుబాటులో లేని పరిస్థితి దాపురించిందన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిల వైఖరి వల్ల కష్టపడే కార్యకర్తలు నష్టపోయారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన శ్రేణులను, వాలంటీర్ వ్యవస్థను నట్టేట ముంచి జగన్ తీవ్ర ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీలో స్పష్టమైన వ్యవస్థాగత సభ్యత్వాలు ఉండవని, సంతకాలు లేని లెటర్ ప్యాడ్లపై పదవులు కేటాయిస్తారని ఎద్దేవా చేసిన ఆయన, సొంత మీడియాను కేవలం వ్యక్తిగత భజనకు మాత్రమే పరిమితం చేసుకున్నారని విమర్శించారు. వైఎస్సార్ ఆశయాలకు నీళ్లు వదులుతూ కార్యకర్తలను, ప్రజలను విస్మరిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీలో కొనసాగడం ఆత్మద్రోహంతో సమానమని పేర్కొన్న విజయభాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి స్థాపించబోయే నూతన వేదిక ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.