BREAKING
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్‌కు ఘన నివాళులు.. కన్నీటి పర్యంతమైన మలయాళ చిత్ర పరిశ్రమ! పంటల సాగులో సేంద్రియ పద్ధతులను పాటించాలి - రైతులకు సహాయ వ్యవసాయ సంచాలకురాలు రాధిక సూచన ఔషధ మొక్కల (అశ్వగంధ, మునగ, తులసి) సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించండి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం కొత్తగూడకు బీటీ రోడ్డు వేయాలి - సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి 36వ రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయాలి విజయ్ దేవరకొండ, రష్మిక జోడీపై విమర్శలు.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు! గర్భిణుల తొలి త్రైమాసిక నమోదు నుంచి ప్రసవం వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి తాళాయికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు, ఫీజుల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి - DYFI డిమాండ్ పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ విరావి ఫస్ట్ లుక్ విడుదల.. పాన్ ఇండియా రేంజ్‌లో మిస్టిక్ థ్రిల్లర్! ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం * గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం * అభివృద్ధికి భరోసా నాది.. అండగా నిలవండి - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అక్కడ తప్పిదాలే రెండు అపజయాలకు మూలం! సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ట్రైలర్ మిస్సింగ్.. దీపావళి హడావుడిలో అసలేం జరిగింది!

పార లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకం

Select Suryaa Now
పార లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంసమాజంలో చట్టాలు, హక్కులపై సరైన అవగాహన లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వివిధ వర్గాల ప్రజలకు న్యాయ సహాయాన్ని చేరవేయడంలో పారా లీగల్ వాలంటీర్ల పాత్ర అత్యంత కీలకమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు.

మంగళవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పారా లీగల్ వాలంటీర్లకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, న్యాయ సేవాధికార సంస్థకు మధ్య పారా లీగల్ వాలంటీర్లు విశ్వసనీయమైన వారధిగా నిలవాలని సూచించారు. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవాభావంతో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా, నిజాయితీతో నిర్వర్తించాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వాలంటీర్లకు కల్పించిన గుర్తింపు, అధికారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా అనధికారిక కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేయకూడదని స్పష్టం చేశారు. సంస్థ నిర్దేశించిన నిబంధనలు, విధివిధానాలకు లోబడి మాత్రమే బాధ్యతలు నిర్వహించాలని సూచించారు.సీనియర్ న్యాయవాది డాక్టర్ పి. త్రినాథరావు మాట్లాడుతూ సమాజంలోని అనేక మంది ప్రజలకు ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశాలు, ప్రాథమిక హక్కులపై సరైన అవగాహన లేదన్నారు. అటువంటి వారికి పారా లీగల్ వాలంటీర్లు అండగా నిలుస్తూ, వారి సమస్యలను గుర్తించి, తగిన న్యాయ సహాయం అందేలా కృషి చేయాలని సూచించారు. సీనియర్ న్యాయవాది డాక్టర్ పి. త్రినాథరావు తెలుగులో రచించిన “అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006: తరచూ అడిగే ప్రశ్నలు – వివరణ” అనే పుస్తకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనేద్ అహ్మద్ మౌలానా ఆవిష్కరించారు.అనంతరం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, విధివిధానాలు, వారి అధికార పరిధి, ప్రజలకు న్యాయ సహాయం అందించే విధానం తదితర అంశాలపై సీనియర్ న్యాయవాది డాక్టర్ పి. త్రినాథరావు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు