పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి
పూసపాటి రేగ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పరిషత్ ఎన్నికల కొలహాలు ముగియంతో మండలంలోని పంచాయతీ ఎన్నికల నగారకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పూసపాటిరేగ 28 పంచాయతీలు ఉండగా, 60,180 మందు ఓటర్లు 290 వార్డు సభ్యులతోపాటు సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పూసపాటి పాలెం పంచాయితీలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగకుండా అక్కడ గ్రామ పెద్దలతో పాటు పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యేక సమావేశం సర్పంచి పదవిని వేలంపాట విడమే కాకుండా ఆ పదవిని రూ. 20 లక్షలకు గతంలో మూడుసార్లు వేలంపాటలో కైవసం చేసుకున్న పాత మాజీ సర్పంచి రౌతు సత్యం మరోసారి వేలంపాట ద్వారా సర్పంచ్ పదవిని ముందే కైవసం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన పంచాయితీల్లో కూడా కూటమి నాయకులు పరిషత్ ఎన్నికల్లోనే సర్దుబాటు చేసుకో పోవడంతో తాజాగా జరుగునున్న ఎన్నికల్లో కూడా ఎవరికి వారే పార్టీలు కతీతంగా పోటీ చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. 1995 తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నవారికి సర్పంచ్ గా పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో అటువంటివారు పరోక్షంగా వేరే వారిని నియమించుకొని పాలన సాగించాల్సిన పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వంలో ఈ నిబంధనను సడలించడంతో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు దక్కడంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉండేందుకు పలువురు పోటీకి ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయా పంచాయితీల్లో రిజర్వేషన్లు, రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు రానివారు తమ తరుపున వేరొకరిని నియమించుకునేందుకు వారు వారి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమని చూసిన వారు కూడా ఈసారైనా సర్పంచ్ పదవిని దక్కించుకోవాలన్న ఉత్సాహంతో సర్పంచ్ పదవులకు పోటీ చేసేందుకు పావులు కదుపుతూనే ఉన్నారు. మరి కొందరు పల్లెల్లో అవగాహన రాజకీయాలతో ఎదుటి వ్యక్తులను పోటీ చేయకుండా తాయిలాలను ఎరచూపి వారిని నిరోధించేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో తలపడేందుకు అధికమందే పోటీ చేస్తారన్నది పల్లెలు వాతావరణం బట్టి తెలుస్తోంది. ఈ రాజకీయ రణరంగంలో ఎంతమంది పోటీ చేసి తమ భవితవ్యాన్ని తేల్చుకుంటారు అన్నది కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే మరి.