కానిస్టేబుల్ కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్ అందజేత -జిల్లా ఎస్పీ
నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్:విధి నిర్వహణలో అకాల మరణం చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ రామస్వామి కుటుంబానికి పోలీస్ భద్రత వెల్ఫేర్ అసోసియేషన్ మంజూరు చేసిన రూ. 5 లక్షల పర్సనల్ ఇన్సూరెన్స్ చెక్కును ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ కానిస్టేబుల్ రామస్వామి సేవలను గుర్తుచేసుకుంటూ, వారి కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏ.వో కృష్ణయ్య, ఆర్ఎస్ఐ గౌస్ పాషా, జిల్లా పోలీస్ కోఆర్డినేటర్ గోలి.శ్రీనివాస్ , మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
-పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్