BREAKING
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు - జిల్లా కలెక్టర్ కె.హరిత నందమూరి బాలకృష్ణతో పనిచేయడం అదృష్టం.. ‘దాదా’ షూటింగ్ అనుభవాలు పంచుకున్న సునీల్ రెడ్డి! కొమురం భీం 86వ వర్ధంతికి కలెక్టర్‌ను ఆహ్వానించిన మంగి గ్రామస్తులు ఉమ్మడి గోదావరి లో సానా మార్క్, కూటమి విజయ వ్యూహలను సాన పెట్టిన సానా. తూర్పుగోదావరి జిల్లాలో ఐటి హబ్ గా తీర్చిదిద్దాలి విద్య, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది! ఎన్నికల ఫలితాల తర్వాత ఆరోపణలా.. ప్రజాతీర్పును గౌరవించాలి! తాడ్వాయి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి - ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి ఓటీటీలో అలరించడానికి వస్తున్న రొమాంటిక్ బోల్డ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *గజపతినగరంలో మొదలైన 'కార్తీక మాస' పూజలు తెలంగాణ రైతులకు ₹25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి! రాజీనామా చేసిన ఏఎంసీ చైర్మన్

రహదారి పునరుద్ధరణకు చర్యలు

Select Suryaa Now
రహదారి పునరుద్ధరణకు చర్యలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండల పరిధిలోని కరిచర్లగూడెం నుంచి సంజీవపురం వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతిందని, ప్రజలకు రాకపోకల పరంగా ఇబ్బందులు కలగకుండా రహదారి పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కరిచర్లగూడెం – సంజీవపురం రహదారిని క్షేత్రస్థాయిలో సందర్శించి, మొరసు తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. భారీ వర్షాలు, వరద ప్రవాహం కారణంగా సుమారు 320 మీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైందని, సుమారు 700 మీటర్ల మేర రహదారి విరిగి ఒకవైపునకు ఒరిగిపోవడంతో పాటు కుంగిపోయిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రహదారి దెబ్బతిన్న తీరును, వరద ప్రవాహం కారణంగా ఏర్పడిన పరిస్థితులను కలెక్టర్ పరిశీలించి, చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

దెబ్బతిన్న రహదారిపై ప్రజలు, వాహనదారులు ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రహదారిపై తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు వివరించారు. రహదారి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గండి పడిన ప్రాంతంలో వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా పైప్‌లైన్లు ఏర్పాటు చేసి, నీటి ప్రవాహాన్ని సక్రమంగా మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దెబ్బతిన్న రహదారి ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతు, పునర్నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారు. రెండు శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ బాలకృష్ణతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిస్థితులపై మాట్లాడి, రహదారికి జరిగిన నష్టం, చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు, పూర్తిస్థాయి పునరుద్ధరణకు అవసరమైన చర్యల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు రాకపోకల విషయంలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గత మూడు రోజులుగా గోపాలపురం మండలంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించడం జరిగిందని తెలిపారు. అస్నా, మిచౌంగ్ తుపానుల ప్రభావంతో కేవలం ఐదు గంటల వ్యవధిలోనే దాదాపు 60 మిల్లీమీటర్ల మేర కురిసిన కుండపోత వర్షానికి తోడు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు చెరువులకు గండ్లు పడి విస్తారంగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బలమైన ఈదురు గాలులు, వర్షాల వల్ల ముఖ్యంగా వరి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పంట నష్టం లెక్కింపు (క్రాప్ ఎన్యూమరేషన్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని వెల్లడించారు. జిల్లాలో జరిగిన తీవ్ర నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర అంతర్-మంత్రిత్వ బృందాన్ని  పంపాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, త్వరలోనే ఆ కేంద్ర బృందం ఇక్కడి ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వివరించారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను త్వరితగతిన పునరుద్ధరించి, ప్రజలకు సాధారణ రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.