BREAKING
ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ.... నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి... అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి . జనసేన రాష్ట్ర నాయకులను కలిసిన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు

తెలంగాణ రైతులకు ₹25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి!

Select Suryaa Now
తెలంగాణ రైతులకు ₹25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి!



నేరడుగొమ్ము,మేజర్ న్యూస్:- ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడటంతో తెలంగాణలో రైతాంగం,వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి బొమ్ము రామాంజనేయులు డిమాండ్ చేశారు.నేరడుగొమ్ము తాసిల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ,వాతావరణ మార్పులు,ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవక పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించడంతో పాటు,వ్యవసాయ కూలీలు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అనంతరం ఇంచార్జ్ ఆర్ఐ సునీల్ కి వినతిపత్రం అందించి పంట నష్టపోయిన రైతులను అదుకోవాలని,ప్రజలకు త్రాగునీరు,సాగునీరు సమస్యను పరిష్కరించాలని కోరారు.నీటి వనరుల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ప్రజలు,రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు.పంట నష్టపరిహారం,ఉపాధి కల్పన, నిత్యావసర సరుకుల పంపిణీ, తాగునీటి సరఫరా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.ప్రజల కష్టాలు ప్రభుత్వాలకు పట్టకపోతే ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరిస్తూ, రైతాంగం,కార్మికవర్గం,పేద ప్రజల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు మాషబోయిన  బిక్షమయ్య,బెజవాడ లక్ష్మయ్య,బిక్షమయ్య,సైదులు, మంగు నాయక్,వెంకటయ్య, అంబాలి,బామిని,వెంకటి,హనుమంతు,బూరో,గణేష్,రమేష్, రతన్,కొండల్,శంకర్,శ్రీను, వెంకటమ్మ,అంజమ్మ,శ్రీకాంత్, కే.నరసింహులు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.