రాజీనామా చేసిన ఏఎంసీ చైర్మన్
గజపతినగరం, సూర్య : గజపతినగరం మండలంలో ఇటీవల జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం 14 ఎంపీటీసీలు అత్యధిక మెజార్టీతో గెలుపొంది, 2 ఎంపీటీసీ వైసీపీ గెలుపు పొందగా అలాగే కూడా కూటమి ప్రభుత్వం బలపరిచిన బిజెపి జడ్పిటిసి అభ్యర్థి రెడ్డి పావని ఓటమి చాలా ఘోరమని 14 ఎంపీటీసీలు భారీ మెజార్టీతో గెలిచినా కూడా క్రాస్ ఓటింగ్ కారణంగా ఓటమి చెందారని ఎంతో బాధపడుతున్నానని నేను 26 సంవత్సరాలు భారత జనతా పార్టీలో పూర్తి సమన్వకర్తగా పనిచేశాను, పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ రెడ్డి పావని ఓటమి చెందడం నా మనసు గాయం అయింది, అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాకు గజపతినగరం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 2 పూర్తి బాధ్యతలు అప్పగించినప్పటికీ గత ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ఇప్పుడు తక్కువ మెజార్టీ రావడం వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది, ఇది నా వైఫల్యంగా భావిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ AMC చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను రేపటి నుంచి సాధారణ టిడిపి కార్యకర్తగా ఏ బాధ్యత అప్పగించిన వస్తున్న పంచాయతీ ఎన్నికల్లో నా వల్ల పార్టీకి ఎటువంటి నష్టం జరగకుండా నా శక్తి మేరకు కృషి చేస్తాను అని చెప్పడం జరిగింది.