ఎస్సైగా నరేష్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సూర్య శంకరపట్నం: కేశవపట్నం పోలీస్‌స్టేషన్ ఎస్సైగా నంది రెడ్డి నరేష్‌రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ టూటౌన్ నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై శేఖర్ టూటౌన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై సంపతి, హెడ్ కానిస్టేబుళ్లు మోహన్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు సరిత, అంజలి, హోంగార్డు రజితతో పాటు పోలీసు సిబ్బంది నరేష్‌రెడ్డికి స్వాగతం పలికారు.