పది రోజులుగా తాగునీటి పైప్‌లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న విలువైన నీరు..
అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:అనంతపురం నగరంలోని రాంనగర్ బ్రిడ్జి కింద గత పది రోజులుగా తాగునీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా విలువైన తాగునీరు వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది. ప్రతిరోజూ ప్రజలకు అవసరమైన తాగునీరు ఇలా వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైప్‌లైన్ లీకేజీ కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా నగరపాలక సంస్థ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ప్రజలకు తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించే అధికారులు.. ఇలా నీరు వృథాగా పోతుంటే ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.