andhrapradesh
రేపు సాయంత్రం విశాఖకు చంద్రబాబు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం విశాఖపట్నం చేరుకోనున్నారు. నగరంలో ఈ నెల 12, 13 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సమిట్‌కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని, వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు మరియు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు.