BREAKING
టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, మార్కెటింగ్ ప్లానింగ్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్! కోలాహలంగా దండారి వేడుకలు – పాల్గొన్న సర్పంచ్ కల్పన సునీల్ జాదవ్ డైట్ లో అధికారుల సందర్శన నెల్లిమర్లలో ఉపాధ్యాయుడు హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు - జిల్లా కలెక్టర్ కె.హరిత నందమూరి బాలకృష్ణతో పనిచేయడం అదృష్టం.. ‘దాదా’ షూటింగ్ అనుభవాలు పంచుకున్న సునీల్ రెడ్డి! కొమురం భీం 86వ వర్ధంతికి కలెక్టర్‌ను ఆహ్వానించిన మంగి గ్రామస్తులు ఉమ్మడి గోదావరి లో సానా మార్క్, కూటమి విజయ వ్యూహలను సాన పెట్టిన సానా. తూర్పుగోదావరి జిల్లాలో ఐటి హబ్ గా తీర్చిదిద్దాలి విద్య, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది! ఎన్నికల ఫలితాల తర్వాత ఆరోపణలా.. ప్రజాతీర్పును గౌరవించాలి!

యూడబ్ల్యూహెచ్ఎంఎస్‌ పోర్టల్ ద్వారానే సరుకుల ఇండెంట్ - అదనపు కలెక్టర్ రాజేశ్వర్

Select Suryaa Now
యూడబ్ల్యూహెచ్ఎంఎస్‌ పోర్టల్ ద్వారానే సరుకుల ఇండెంట్ - అదనపు కలెక్టర్ రాజేశ్వర్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి  : ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు అందించే సరుకుల సరఫరాలో పారదర్శకత ఉండేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  ఎస్.రాజేశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాకాఫ్ (NACOF) ద్వారా వివిధ ప్రభుత్వ వసతి గృహాలు, కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు సరఫరా చేస్తున్న సరుకుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 'యూనిఫైడ్ వెల్ఫేర్ హాస్టల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' పోర్టల్ ద్వారా ఇండెంట్  నమోదు, తదితర అంశాలపై అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నెలా 5వ తేదీ లోపు సంబంధిత అధికారులందరూ UWHMS పోర్టల్ ద్వారా విధిగా ఇండెంట్ నమోదు చేసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాలకు చేరే సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వీకరించాలని, ఒకవేళ నాణ్యత లోపిస్తే ఆ సరుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా వెంటనే వెనక్కి పంపించాలని తేల్చిచెప్పారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి సోనియా , వివిధ వసతి గృహాల సంక్షేమాధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, నాకాఫ్ ఇన్‌ఛార్జ్ రమాకాంత్, వంశీకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.