telangana
మానిగూడలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
సూర్య జైనూర్: జైనూర్ మండలం మానిగూడ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు.లబ్ధిదారు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశం సందర్భంగా కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి,శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం గ్రామంలో నిర్వహించిన ఆదివాసీ సంప్రదాయ దండారి వేడుకల్లో ఆత్రం సుగుణక్క పాల్గొని ఆదివాసీ సంప్రదాయా పూజలు చేశారు.ఆదివాసుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తోందని తెలిపారు. అలాగే ఆదివాసీ గిరిజన కళలు, సంస్కృతుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షైక్ రషీద్,ఎస్సి సెల్ జిల్లా చైర్మన్ సుద్దాల శ్రీనివాస్,డీసీసీ కార్యవర్గ సభ్యులు పెందూర్ ప్రకాష్,సర్పంచ్ లు మనోహర్, అర్జున్, భుజాంగ్రవ్,శేషపాల్, పట్నాపూర్ ఉపసర్పంచ్ పెందూర్ లచ్చు, జంగావ్ ఉప సర్పంచ్ సజ్జద్, జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షైక్ రహీమ్ముబారక్, మైనార్టీ మండల్ ప్రెసిడెంట్ షైక్,ఎస్సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, అబ్బుషైక్, మజర్, యూత్ కోఆర్డి నేటర్ కోవా సిద్దు, నర్సింగ్, అహ్మద్ ఖాన్, వాసీమ్, ఆదివాసీ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.