చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం
చిట్టమూరు మేజర్ న్యూస్
మండలంలోని స్థానిక గణపర్తి మార్కండేయ నాయుడు ఉన్నత పాఠశాలలో మంగళవారం పోషణ్ శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ మునికుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూపర్‌వైజర్ కవిత మాట్లాడుతూ ఆధార్ శిశు వివరాలు,పిల్లల అభివృద్ధికి సంబంధించిన అంశాలు,చిన్నారుల అభివృద్ధి స్థాయి అంచనాలపై నిర్వహించాల్సిన ప్రక్రియ గురించి అంగన్‌వాడీ కార్యకర్తలకు వివరించారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వారి అభివృద్ధిలో ఎలాంటి లోపాలు ఉన్నా ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం పద్మ నవచేతన కార్యక్రమం గురించి వివరంగా తెలియజేశారు.చిన్నారుల ఆరోగ్యం,ఎదుగుదల, పోషకాహారం,శారీరక మరియు మానసిక వికాసం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ముఖ్యంగా పిల్లల్లో గుర్తించాల్సిన 21 రకాల వైకల్యాలు,వాటి ప్రారంభ లక్షణాలు, వాటిని ముందుగానే గుర్తించే విధానాలు, సంబంధిత సమస్యల నుంచి పిల్లలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు.అలాగే పిల్లల ఎదుగుదల,అభివృద్ధి దశలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం,పోషకాహార లోపాలను గుర్తించడం, అవసరమైన వారికి తగిన వైద్య సేవలు అందేలా చూడటం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి చిన్నారి ఆరోగ్యం, పోషణ, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సిడిపిఓ మునికుమారి తెలిపారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్