BREAKING
రేపు సాయంత్రం విశాఖకు చంద్రబాబు నాగుల చవితి రోజున పెద్ద శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు పది రోజులుగా తాగునీటి పైప్‌లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న విలువైన నీరు.. రాంనగర్ బ్రిడ్జి కింద పట్టించుకునే నాథుడే లేరా?.. వెంటనే లీకేజీని అరికట్టి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్.. జగన్ కు షాక్ ..పార్టీకి ముఖ్య నేత గుడ్ బై కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎస్సైగా నరేష్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పార లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకం రైతులు కూరగాయల పంటను సాగు చేయాలి-కలెక్టర్ స్నేహ శబరీష్, గూడూరులో ఎల్ ని నో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యజమాన్యం పై రైతులకు అవగాహన రక్షణ చర్యలు లేకుండా రోడ్డుపై ప్రమాదకరంగా గుంత.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం! ప్రమాదం జరగకముందే గుంతను పూడ్చాలని స్థానికుల డిమాండ్.. రేపు నగరం కళాశాలలో జాతీయ సదస్సు రహదారి పునరుద్ధరణకు చర్యలు రహదారి పునరుద్ధరణకు చర్యలు రహదారి పునరుద్ధరణకు చర్యలు 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం: మత్స్యకారులకు హెచ్చరికలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లకు ఆమోదం

Select Suryaa Now
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లకు ఆమోదం

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పారిశ్రామిక పురోగతిని వేగవంతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ (CII) భాగస్వామ్య సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం సాధించడమే లక్ష్యంగా చేపడుతున్న ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా సమీక్షించారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రూ. వేల కోట్ల పెట్టుబడులతో కూడిన బహుళ పరిశ్రమలు, డేటా సెంటర్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా భీమిలి అమనంలో రూ. 31,387 కోట్ల భారీ వ్యయంతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ (AI) డేటా సెంటర్, నాయుడుపేటలో రూ. 4,000 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమ, రాంబిల్లిలో రూ. 570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ యూనిట్ మరియు తిరుపతిలో రూ. 700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమల స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.

అలాగే భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ కోసం 24.96 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రావళి స్పిన్నర్స్ రూ. 237 కోట్ల విస్తరణ ప్రాజెక్టుకు, జగ్గయ్యపేటలో 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో భాగంగా విజయవాడ నగరంలో 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ (చెత్త నుంచి విద్యుత్ తయారీ) ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది.