BREAKING
అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన *ఏపీ కూటమి తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన దమ్మపేట మండల టీడీపీ* బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నయనతార 'మూకుత్తి అమ్మన్ 2': నెగటివ్ రివ్యూలను సైతం దాటుకుని పది కోట్ల వసూళ్ల వైపు శిరీకోళం పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా: ఎంపీటీసీ రాజగోపాల్ ఇండియన్ ఫ్యాన్స్ కోరిక మేరకు దీపావళిపై ఆసక్తి కనబరిచిన బీటీఎస్ వీ: అభిమానులకు ప్రత్యేక శుభాకాంక్షలు పంచాయతీ సర్పంచికి వార్డు సభ్యుడికి గుర్తులు సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సామి ఆగ్రహం: ప్రణామ్ సర్వీస్‌పై తీవ్ర విమర్శలు తన 15వ ఏటనే మొదటి మెర్సిడెస్ కారు, ఐదు ఆస్తులు కొన్న నీతూ కపూర్: ఆసక్తికర విషయాలు వెల్లడి డెనిస్ విల్లెనెవ్ తదుపరి జేమ్స్ బాండ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు: పేరు వెల్లడించేందుకు నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా కథ.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వివరాలు రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు. మసీదులు ఆధ్యాత్మిక శాంతికి నిలయాలు గ్రీస్‌ వేదికగా ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, స్టాలిన్ సందడి గ్రామల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు

మంత్రి దుర్గేష్ ను కలిసిన ఎంపిటిసి

Select Suryaa Now
మంత్రి  దుర్గేష్ ను కలిసిన ఎంపిటిసి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామ కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీమతి దాసం నరసవేణి 471 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.విజయం సాధించిన అనంతరం నవంబర్ 7వ తేదీ శనివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను దాసం నరసవేణి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, దాసం నరసవేణి సుబ్రహ్మణ్యం దంపతులకు అభినందనలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అలాగే కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో ఆశీర్వదించి, అఖండ విజయాన్ని అందించిన నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి విజేతలు కృషి చేయాలని ఆకాంక్షించారు.