నంద్యాలలో ప్రధమ నంది దేవాలయం కార్తీక మాసం కలెక్టర్ కి ఆహ్వానం
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాలలో శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని కలెక్టర్ రాజకుమారి గణియాకు దేవస్థానం చైర్మెన్ చలంబాబు, కార్యనిర్వాహక అధికారి చంద్రుడు ఆహ్వానం అందించారు. దేవస్థానం ఆవరణంలో అన్న సత్ర ప్రాంగణం జిల్లా కలెక్టర్ రాజకుమారిచే ప్రారంభోత్సవం జరుగుతున్నది తెలిపారు. మంగళవారం ఉదయం కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ఎనిమిది గంటలకు కలెక్టర్ అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించి చండీ హోమం లో పాల్గొంటారని తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*