గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ..డా. వి. నరేందర్ రెడ్డి
సూర్య కరీంనగర్: గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో కరీంనగర్ రూరల్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు స్వయం ఉపాధి, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సహకరిస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచులు ఆయనను ఘనంగా సన్మానించగా, ఆయన కూడా సర్పంచులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో దుబ్బపల్లి సర్పంచ్ ఎం. ప్రశాంత్ రెడ్డి, ఫకీర్‌పేట్ సర్పంచ్ బి. లక్ష్మణ్, జూబ్లీ నగర్ సర్పంచ్ ఎస్. కమలాకర్, ఎలబోతారం సర్పంచ్ టి. రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బహదూర్‌ఖాన్‌పేట్‌కు చెందిన జి. తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.